శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మూడోసారి విచారణ కోసం శుక్రవారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ పేరిట రేవంత్రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని, ఎట్టిపరిస్థితిలో భయపడేది లేదని తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు విచారణకు పిలిచినా ఒరిగిందేమీ లేదని, ఈ నెల 23న నాలుగోసారి విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. విచారణలో అడిగిందేమీ లేదని, కాలయాపన కోసమే ఇందంతా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో పాల్గొనకుండా ఇబ్బందులు పెడుతున్నట్టు ఆరోపించారు.