
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు పచ్చి అబద్ధం.
యాదాద్రిలో అర్చక, పరిచారక, సహాయ పరిచార క, శివాలయ పరిచారక, అన్నదాన పరిచారక.. ఇలా మొత్తం 21 పోస్టులను జీవో 888 ద్వారా ఎంపిక చేస్తున్నట్టు ఆలయ ఈవో గీత సోమవారం తెలిపారు. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను టీఎస్పీఎస్సీ గైడ్లైన్స్తోనే తయారు చేస్తున్నట్టు వివరించారు. పరీక్ష పేపర్ తయారీ, మార్కులు వేసి ఎంపిక చేయటానికి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేకమైన ఎంపిక కమిటీని నియమించారని వెల్లడించారు. పోస్టుల ఎంపికలో యాదాద్రి ఆలయ ఈవో, అర్చకుల జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు.
ఒవైసీ ఫ్లైఓవర్‌గా నామకరణం అబద్ధంప్రచారం
హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ నుంచి డీఆర్డీవో వెళ్లే రహదారిలో ఇటీవల కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఒవైసీ ఫ్లైఓవర్ అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తలు పచ్చి అబద్ధం.వాస్తవం సంతోష్‌నగర్ నుంచి పిసల్‌బండ వెళ్లే దారిలో ఒవైసీ దవాఖాన ఉన్నది. ఎంతోమంది పేదలు రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. దీంతో అక్కడి రోడ్డుకు ఒవైసీ హాస్పిటల్ రోడ్డు అని, ఒవైసీ జంక్షన్ అని ప్రాచుర్యం ఏర్పడింది. పిసల్‌బండ రోడ్డు అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ దారిలో కట్టిన ఫ్లైఓవర్ కాబట్టి దాన్ని స్థానికులే ఒవైసీ ఫ్లై ఓవర్‌గా, పిసల్‌బండ ఫ్లై ఓవర్‌గా పిలుస్తున్నారు. అంతే తప్ప ప్రభుత్వం దానికి అధికారికంగా ఏ పేరూ పెట్టలేదు.