మంగళవారం 26 మే 2020
Telangana - May 16, 2020 , 12:09:09

ఆన్‌లైన్‌లో సేంద్రీయ మామిడిపండ్లు అందజేత

ఆన్‌లైన్‌లో సేంద్రీయ మామిడిపండ్లు అందజేత

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో సేంద్రీయ మామిడి పండ్లను ఆన్‌లైన్‌లో అందజేసేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌ పోర్టల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. టీఎస్‌ ఆగ్రోస్‌ సహకారంతో గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకు పండ్లను సరఫరా చేయనున్నారు. www.cropmandi.com వెబ్‌పోర్టల్‌ ద్వారా సేంద్రీయ మామిడిపండ్లను ప్రజలకు అందించనున్నారు. ఈ సందర్భంగా పోర్టల్‌ నిర్వాహకులను మంత్రి నిరంజన్‌ రెడ్డి అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. కరోనాతో అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొని ఉందని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి అందరం బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మామిడి, బత్తాయి తదితర పంటలను వినియోగదారుల ఇంటికే తరలించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు వాటి సహకారంతో అనేక ఇతర సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా అందరూ ముందుకు వచ్చి రైతులకు తోడ్పాటునివ్వడం సంతోషించదగ్గ విషయమని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.


logo