MPDO dead: ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) గా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ (55) ఈ (బుధవారం) ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
నాలుగు రోజుల క్రితం గుండె నొప్పి రావడంతో ఎంపీడీవో శ్రీధర్‌ను ఆయన కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన మరణించారు.