హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దసరా, బతుకమ్మ పండుగ షాపింగ్ చేస్తున్నారా? మీ షాపింగ్ పూర్తయిన వెంటనే అద్భుతమైన కానుకలు అందించేందుకు మాంగళ్య షాపింగ్ మాల్ మీకు సాదర స్వాగతం పలుకుతున్నది. వస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూ.. తనదైన ముద్ర వేసిన మాంగళ్యలో చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని వయసుల వారికి అన్ని రకాల వస్ర్తాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు వెరైటీ కలెక్షన్స్‌తో పాటు పురుషులు, మహిళలకు ఆకట్టుకునే సంప్రదాయ దుస్తులు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రత్యేకంగా శారీస్, చుడీదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం.. ఒకటేమిటీ లేటెస్ట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఫ్యాషన్ వస్ర్తాలతోపాటు సంప్రదాయ దుస్తులను అందుబాటులో ఉంచింది. 1 నుంచి 11వరకు రాష్ట్రంలోని అన్ని మాంగళ్య షాపింగ్ మాల్లో వినియోగదారులందరికీ స్పాట్ గిఫ్ట్‌లను అందించి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తనున్నది.