ఖైరతాబాద్, మే 11 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని, రిజర్వేషన్లు తొలగిస్తారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతో పాటు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ తాను జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లు రద్దు కావని, రాజ్యాంగాన్ని మార్చమని బహిరంగంగా ప్రకటించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.