హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మండలాలకు ఎంఈవోలను నియమి స్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. సీనియర్ హెచ్ఎంకు ఎంఈవోగా అదనపు బాధ్యతలప్పగించింది. 2005లో చివరిసారిగా ఎంఈవోలుగా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం 16 మంది మా త్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. ఒక్కోక్కరికి ఐదు, ఆరు మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలుగా అదనపు బాధ్యతలప్పగించారు. ప్రతి మండలానికి ఎంఈవోను నియమించడాన్ని తెలంగాణ గెజిటడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ స్వాగతించింది. కొనసాగింపుగా ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూ పొందించి, పూర్తిస్థాయి పదోన్నతులు కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ కోరారు. ఎంఈవోల నియామకం ప్రాథమిక విద్యకు శుభపరిణామమని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎంఈవోగా అమెరికాలో ఉన్న హెచ్ఎం
అధికారుల నిర్లక్ష్యానికి ఖమ్మం జిల్లాలో జరిగిన ఎంఈవోల నియామక ఘటన నిదర్శనంగా నిలిచింది. సెలవుపై అమెరికాకు వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఎంఈవోగా పూర్తిబాధ్యతలు అప్పగించడం ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
కాళేశ్వరం, సెప్టెంబర్ 24: కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు. మంగళవారం ఈవో కార్యాలయంలో ఆలయ అభివృద్ధి, సరస్వతీ పుషరాల నిర్వహణకు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.