వరంగల్, ఏప్రిల్ 26(నమస్తేతెలంగాణ)/మహబూబాబాద్ రూరల్/ నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్కర్నూల్ బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం, వరంగల్ ఇండిపెండెంట్ అభ్యర్థి బాబూమోహన్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. శుక్రవారం చేపట్టిన స్క్రూటినీలో నాగర్కర్నూల్లో 13, వరంగల్ నియోజకవర్గంలో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సినీ నటుడు బాబూమోహన్ కూడా ఉన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ నామినేషన్ వివాదాస్పదంగా మారింది. నగేశ్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పూర్తి వివరాలు వెల్లడించలేదంటూ బీఎస్పీ అభ్యర్థి ట్విట్టర్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, కాంగ్రెస్ నాయకులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.