రంగారెడ్డి, జనవరి 12 (నమస్తేతెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.
దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భువనగిరి జిల్లాలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు తమ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంపై ధ్వజమెత్తారు. క్యామ మల్లేశ్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి వనస్థలిపురం ఠాణాకు తరలించారు.