సీసీసీ నస్పూర్, డిసెంబర్ 31: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులకు దవాఖానను శుభ్రం చేయాలంటూ మంచిర్యాల కోర్టు శిక్ష విధించింది. ఎస్సై సుగుణాకర్ ఇటీవల సీసీసీ నస్పూర్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పలువురు మద్యంప్రియులు పట్టుబడ్డారు.
వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఉపనిషేద్వానీ మూడు రోజులపాటు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానను శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశించినట్టు ఎస్సై తెలిపారు. ఈ మేరకు మంగళవారం 8 మంది మద్యంప్రియులు దవాఖాన ప్రాంగణమంతా శుభ్రపరిచారు.