‘మన ఊరు -మన బడి’ని పకడ్బందీగా అమలు చేయాలి : సందీప్ కుమార్ సుల్తానియా
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ సంచాలకులు దేవసేన, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్తో కలిసి ఆయన జిల్లాలో పర్యటించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పాఠశాల భవనం, గదులు, మూత్రశాలలు వంటి వాటిని అధునాతనంగా మార్పు చేసి పిల్లలకు సౌకర్యవంతంగా వుండే విధంగా చూడాలని అన్నారు.
పూర్వ విద్యార్థులు పాఠశాలలకు విరాళాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అధికారులకు తాము చదివిన పాఠశాలలను బాగు చేసుకోవడం మంచి అవకాశమని, అందరు సమిష్టిగా పని చేయాలని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ వారు అవసరమైన వాటికి అంచనా ప్రతిపాదనలు తయారు చేసి ఎక్కడైతే సమస్యలుంటాయో అక్కడే నిధులు వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామాన్ని సందర్శించిన సమయంలో రహదారి, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించానని, చాలా చోట్ల సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేవన్నారు. అలాగే గ్రామ పంచాయతీ వారు ప్రతి రోజు రహదారుల, మురుగు కాలువలు శుభ్రపరచాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాలను ప్రతిరోజు సాయంత్రం వేళలో అధికారులు సందర్శించి శ్రద్ధతో వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి రోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చి విక్రయించాలని, ప్రతి రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది 100 శాతం హాజరయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

