మేడ్చల్ మల్కాజిగిరి : ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోని ఘట్కేసర్ మండల పరిధి ఎదులాబాద్, అంకుషాపూర్ లలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం అదనపు గదుల నిర్మాణాలకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల ఆధునీకరణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
ప్రజలు, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టాలని, అందుకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీఓ అరుణ, సర్పంచ్లు జలజ, సురేష్, వెంకటేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ మూసీ శంకర్, ఎంపీటీసీలు కందుల సరళ, శోభ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మాజీ అధ్యక్షుడు కందుల కుమార్ ప్రధాన కార్యదర్శి ప్రవీన్ రెడ్డి, నాయకులు బట్టే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.