సిరిసిల్ల రూరల్, జూన్ 8: భార్యపై కోపం తో ఆమెతోపాటు ఇంటిపై కిరోసిన్ పోశాడో ప్రబుద్ధుడు. ఆ వెంటనే ఇంటికి నిప్పంటించడంతో ఆమె తృటిలో తప్పించుకొన్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో కలకలం రేపింది. గ్రామానికి చెందిన బాలపోశయ్య, రాజేశ్వరి దంపతులు. శనివారం ఇంట్లో ఇద్దరూ గొడవ పడ్డారు. క్షణికావేశానికిలోనైన బాలపోశయ్య తన భార్యపై కిరోసిన్ పోయడంతోపాటు ఇంటిపైనా చల్లాడు. బయటకు వచ్చి ఇంటికి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజేశ్వరి తప్పించుకొని బయటికి రావడంతో ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశా