గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:43

ప్రాణవాయువును దాచేస్తున్నారు

ప్రాణవాయువును దాచేస్తున్నారు

  • ఆక్సిజన్‌ సిలిండర్ల విక్రేత అరెస్టు
  • ముషీరాబాద్‌లో 84 సిలిండర్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వేళ ప్రాణవాయువు కూడా బ్లాక్‌మార్కెట్‌లో సరుకైపోతున్నది. ప్రజల అవసరాలను అవకాశంగా చేసుకుని కొంత మంది జోరుగా ఆక్సిజన్‌ దందా నడుపుతున్నారు. ఇలాంటి వ్యాపారంలో ఉన్న హైదరాబాద్‌లోని ఓ వ్యాపారిని సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద 84 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు విక్రయించాలంటే డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ, కంట్రోల్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అథారిటీల అనుమతి ఉండాలని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు చెప్పారు. కానీ, అవేవీ లేకుండా ముషీరాబాద్‌లోని బాకారంలో రాస్‌ ఏజెన్సీస్‌ పేరుతో షకీర్‌హుస్సేన్‌ అనే వ్యాపారి ఆక్సిజన్‌ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. విషయం తెలిసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జావెద్‌ బృందం మంగళవారం రాత్రి ఆ దుకాణంపై దాడిచేసింది. 27 నింపిన ఆక్సిజన్‌ సిలిండర్లు, 57 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నది. నిందితుడు షకీర్‌ను అరెస్ట్‌ చేసి, తదుపరి విచారణను ముషీరాబాద్‌ పోలీసులకు అప్పగించింది.


logo