భూవివాదం పరిష్కారం పేరిట 39 లక్షలు వసూలు
మాజీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
బంజారాహిల్స్, ఫిబ్రవరి 10: జనాన్ని మోసగించి డబ్బులు దండుకొంటూ, సెటిల్మెంట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ పోలీసు అధికారి అల్లం కిషన్‌రావు(62)ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి నాలుగు నకిలీ తుపాకులు స్వాధీ నం చేసుకున్నారు. గురువారం బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, డీఐ ఆకుల రమేశ్ కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన ఎండీ అబ్బాస్ కృష్ణానగర్‌లో భూవివాదం విషయమై యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ లో ఉండే కొత్త లక్ష్మణ్ ద్వారా కిషన్‌రావు వద్దకు వెళ్లా డు. పోలీసుశాఖలో డీఐజీగా పనిచేస్తున్నట్టు కిషన్‌రా వు చెప్పుకొన్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నని, నయీ మ్ ఎన్‌కౌంటర్‌తో సహా అనేక ఎన్కౌంటర్లలో పాల్గొన్నానని నాలుగు తుపాకులు చూపించాడు. భూవివా దం పరిష్కారానికి రూ.కోటి ఖర్చవుతుందని చెప్పా డు. అంతడబ్బు ఇవ్వలేనని చెప్పిన అబ్బాస్ పలువిడతలుగా రూ.39 లక్షలు ముట్టజెప్పాడు. నెలలు గడిచి నా సమస్య పరిష్కారం కాలేదు. ఈలోగా కిషన్‌రావు గురించిన నిజాలు తెలిశాయి. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పనిచేశాడని, చాలా ఏండ్లక్రితమే సస్పెండ్ అయ్యాడని తేలింది. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని అబ్బాస్ పలుమార్లు కిషన్‌రావును అడిగితే హత్యకేసులో, రేప్‌కేసులో ఇరికిస్తానంటూ బొమ్మ తు పాకీతో బెదిరించాడు. బాధితుడు ఈనెల 8న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అ దుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదా లు చేయగా కట్టల కొద్దీ ప్రామిసరీ నోట్లు, 2 ఎయిర్ రైఫిల్స్, ఎయిర్‌గన్, పిస్టల్ ఆకారంలో ఉన్న లైటర్‌తో పాటు రద్దుచేసిన కరెన్సీనోట్లు, మద్యం బాటిళ్లు, ఐదుకార్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కిషన్‌రావును స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గతంలోనూ కిషన్‌రావు మీద కేసులున్నాయి. తాజాగా ఐపీసీ 389,405, 420తోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.