బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 22:10:05

డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా వ్యక్తి మృతి

డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా వ్యక్తి మృతి

హైదరాబాద్‌ : డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉప్పల్ పారిశ్రామికవాడలో శుక్రవారం ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన భీమా నాయక్(35), ఊమ్లా నాయక్(35) కొంతకాలంగా కూలీ పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి తార్నాక, హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. 

శుక్రవారం ఉదయం ఉప్పల్‌ పారిశ్రామిక వాడలోని  ఓ ఫార్మా సంస్థలో డ్రైనేజీ సంపును శుభ్రం చేసేందుకు వచ్చారు. సంపులోకి దిగిన పని చేస్తుండగా ఊపిరాడక ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.