హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తన భార్య పుట్టింటికి వెళ్లడానికి పిన్ని కారణమని అనుమానంతో ఆమెను అతిదారుణంగా హత్యచేసిన సంఘటన విజయవాడలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడలోని భవానీపురం ఉర్మిళనగర్లో ఓ వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో ఆమె అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీనికి తన పిన్ని కారణమని అనుమానంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న నిందితుడు . ఈనెల 1న బండిపై ఎక్కించుకుని పదునైన ఆయుధంతో నరికి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేసి.. అక్కడ నుంచి పారిపోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.