హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లను కల్పించి న్యాయం చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ తరపున మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్ కోరారు. దాదాపు 150 మంది ఉపాధ్యాయులు సోమవారం ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీకి తరలివచ్చి ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు.
సమస్యలపై వినతిపత్రం అందజేశారు. త్రీ వన్ సెవెన్, ప్రమోషన్స్ కోసం ఒక షెడ్యూల్ అనౌన్స్ చేయాలని అధికారులకు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నామని, ముగిశాక ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు.