హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీ ల్లో జర్నలిస్టులతో చిట్‌చాట్ నిర్వహించి.. బీఆర్ఎస్ గెలిస్తే జరిగే పరిణామాలపై చర్చించారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అవుతుండేనని, సినిమాలు తీసి, టీవీ చానల్ పెడుతుండే’ అని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం బీజేపీ, సీపీఐ పలు అంశాలపై వాయిదా తీర్మానాలను అందజేయగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చించాలని సీపీఐ వాయిదా తీర్మానాన్ని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నాయని బీజేపీ వాయిదా తీర్మానాన్ని అందజేసింది. రెండింటినీ స్పీకర్ తిరస్కరించారు.