ఖైరతాబాద్, అక్టోబర్ 17 : మాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ నవంబర్ 23న సరూర్‌నగర్ స్టేడియంలో మాలల రణభేరి సభ నిర్వహించనున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో కాంగ్రెస్ సర్కారు మాలలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీలోని కొందరు మంత్రులు కుట్రజేసి రోస్టర్ పా యింట్ల కేటాయింపులో మాలలకు ఒక్కశాతమే కేటాయించారని.. ఫలితంగా వి ద్యా, ఉద్యోగాల్లో మాల విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
మరోవైపు ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్లు, సబ్‌ప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు పెండింగ్ పెట్టారని విమర్శించారు. సమావేశంలో మాల మహానాడు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీ కోటేశ్వర్రావు, మధుబాబు, బేగరి మహేశ్, లలిత, ఆనంద్‌బాబు, నాగమణి, మౌనిక పాల్గొన్నారు.