ఖైరతాబాద్, డిసెంబర్ 17 : సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ 19న మాల సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జే చెన్నయ్య తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణను చేపడుతానని రేవంత్‌రెడ్డి ప్రకటించడంతోపాటు ఆ దిశగా చర్యలు చేపట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.