హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న వరంగల్‌లో నిర్వహించనున్న రైతుసభను విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎన్నారై నాయకులు సభ విజయవంతంకోసం సోషల్‌మీడియా వేదిక ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. సోమవారం వరంగల్ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు.
వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు సభ పోస్టర్‌ను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఆవిష్కరించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, సీనియర్ నేతలు హరిగౌడ్, రవి, సత్య , రవి పులుసు, అంజన్‌రావు, వనన్కల్యాణ్, తరుణ్ లునావత్, అజయ్‌రావు ఉన్నారు.