బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:34:47

పదోన్నతులు కల్పించండి

పదోన్నతులు కల్పించండి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను డిప్యూటీ కలెక్టర్లు కోరారు. మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ను తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రతినిధులు కలిశారు. సీఎస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్‌ను కలిసినవారిలో ఆ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి ఏ భాస్కర్‌రావు తదితరులున్నారు. 

 వెటర్నరీ పోస్టులను శాఖాపరంగా భర్తీ చేయాలి 

వెటర్నరీ డాక్టర్‌ పోస్టులను శాఖాపరంగా భర్తీచేయాలని తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్‌కు అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ శ్రీధర్‌ అనిల్‌రెడ్డి, రాజేందర్‌, మోహన్‌లాల్‌, రమేశ్‌ వినతిపత్రం అందజేశారు. 

ప్రైవేటు ఉద్యోగులకు సాయం అందించాలి 

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధి కోల్పోయిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి ఆర్థికసాయం అందించాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. 

పీఆర్సీని వెంటనే ప్రకటించండి 

పీఆర్సీని వెంటనే  ప్రకటించాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వాన్ని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు సీఎస్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు. 

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ను ఏర్పాటుచేయాలి

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ను ఏర్పాటుచేయాలని, అదనపు కలెక్టర్లుగా గ్రూప్‌-1 అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూ ప్‌-1 అధికారుల సంఘం సీఎస్‌కు విజ్ఞప్తిచేసింది. సంఘం అధ్యక్షు డు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, ప్రధానకార్యదర్శి హన్మంత్‌ నాయక్‌  మంగళవారం సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఐఏఎస్‌ అధికారులు సునీల్‌శర్మ, అరవింద్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి, దివ్యదేవరాజన్‌, రిజ్వి, బుద్ధప్రకాశ్‌, సర్ఫరాజ్‌, సత్యనారాయణ, రాహు ల్‌ బొజ్జా, ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ సీఎస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


logo