Fahadh Faasil | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే మలయాళం మూవీ ఇండస్ట్రీ అని చెప్పక తప్పదు. జనవరిలో భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాలీవుడ్ ఆ తర్వాత ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, ‘దిగోట్లైఫ్’ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకుంది. అయితే ఈ సినిమాల అనంతరం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మరో చిత్రం ‘ఆవేశం’. పుష్ప నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై ఇప్పటివరకు దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.