హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించా రు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని రైతులంతా హాజరయ్యేలా ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. అధునాతన సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏ ర్పాటుచేయాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు గోదావరి జలాలు
హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని సీఎం రేవంత్‌రెడ్డి జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు. డిసెంబర్ 1 వరకు టెండర్లు పిలిచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.