వైరా టౌన్, మే 3: ప్రభుత్వం సర్వర్ డౌన్ చేయడంతోనే మక్కల కొనుగోళ్లు నిలిచిపోయిందని రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు ఆరోపించారు. శని, ఆదివారాల్లో సర్వర్ డౌన్ కావ డంతో ఖమ్మం జిల్లాలో మక్క రైతుల వివరాలు, ఎగుమతి కేంద్రాల వివరాలు, దిగుమతి చేయాల్సి గోదాముల వివరాలు, బస్తాలు లోడ్ చేసిన లారీల వివరాలు కన్పించడం లేదని అన్నారు. అనంతరం వైరాలో కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. సర్వర్ డౌన్ వల్ల రైతులు సతమతమవుతున్నారని, మక్కల కొనుగోళ్లు, తరలింపు, దిగుమతి ప్రక్రియకు ఆటంకం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.