హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఇసుక, గ్రానైట్ అక్రమ మై నింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన రూ.80.05 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాతాలికంగా జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈ చర్య చేపట్టినట్టు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం సో మవారం ప్రకటనలో వెల్లడించింది. పటాన్చెరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా రంగంలోకి దిగి న ఈడీ అధికారులు దర్యాప్తులో పలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చా రు.
గూడెం మధుసూదన్‌రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ శాండ్ అండ్ గ్రా నై ట్ సప్లయ్ కంపెనీ ప్రభుత్వ అనుమతి లేకుండా పటాన్చెరులో అధిక మైనింగ్ చేపట్టడంతోపాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్ నిర్వహించిందని, దీని వల్ల రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.39.08 కోట్ల రాయల్టీ నష్టం వా టిల్లిందని, నిందితులు అక్రమంగా 300 కోట్లకుపైగా ఆదాయాన్ని పొందారని ఈడీ గుర్తించింది. వివిధ వ్యక్తుల పేరిట ఆస్తులు ఉన్నప్పటికీ వారంతా బినామీలేనని, ఆ ఆస్తుల నిజమైన లబ్ధిదారుడు మధుసూదన్‌రెడ్డే అని తేల్చింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన రూ.78.93 కోట్ల విలువచేసే 81 ఆస్తులతోపాటు అక్రమంగా అమ్మిన వస్తువుల ద్వారా ఆయనకు రావాల్సిన రూ.1.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను తాతాలికంగా జప్తు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.