హైదరాబాద్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ): గతంలో సత్యం కంపెనీ చూపిన లెకల అవకతవకలను ఆధారంగా చేసుకొని పన్ను మదింపు చేయడం సరికాదని మహీం ద్ర సత్యం కంపెనీ హైకోర్టులో వాదించింది. సత్యం సాం కారణంగా 2002- 2009 కాలంలో వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆ కంపెనీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జ ల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.