హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): సంక్షోభంలో ఉన్న సత్యం కంపెనీని ఆదుకొన్న పాపానికి ఐటీ, ఈడీ శాఖల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నామని మహీంద్ర సత్యం కంపెనీ ఆరోపించింది. గతంలో సత్యం చూపిన అవకతవకల లెకలను ఆధారంగా చేసుకుని పన్ను మదింపు చేయటం సరికాదని, ఆ సంస్థను స్వాధీనం చేసుకున్న మహీంద్ర సత్యం కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. సత్యం సాం కారణంగా 2002-2009 కాలంలో వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్బెంచ్ బుధవారం విచారించింది. లేని ఆదాయాన్ని సత్యం రామలింగరాజు చూపించారని, అది వాస్తవ ఆదాయం కాదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదించారు. ఊహాజనిత ఆదాయంపై పన్ను లెకిస్తే రూ.5 వేల కోట్ల వరకు తాము చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వివరించారు. వడ్డీ లెకిస్తే రూ.10 వేల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు.