హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్‌గౌడ్ ప్రమాణం చేశారు. బుధవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారితో తన చాంబర్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. వారిని అభినందించారు. మండలి నిబంధనలకు సంబంధించిన పుస్తకాలు, గుర్తింపు కార్డును అందజేశారు. పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరు ఎన్నికయ్యారు.