హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులకు కూడా బీమా(,Gulf Bhima) సదుపాయం వర్తింపజేస్తామని సీఎం(CM KCR) కేసీఆర్ హామీ ఇవ్వడంపై బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు గల్ఫ్ కార్మికుల బాధలు పలు మార్లు విన్నవించామన్నారు. గల్ఫ్ కార్మికులకు తప్పకుండా సరైన సమయంలో వాళ్లకి అన్ని రకాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు కూడా బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన ఈ ఒక్క హామీతో ఉత్తర తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంత వాసులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎన్నారైలు ఎక్కడికక్కడ ప్రతి ప్రక్షాలు చేసే కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.