హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస జీవనాధారంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ఉనికి ప్రమాదంలో పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న ఈ చట్టానికి కేంద్రంలోని బీజేపీ సరార్ ఉరి వేసేందుకు సిద్ధమైంది. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీ-జీరామ్-జీ) పేరుతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు.. ఉపాధి హామీ పథకాన్ని సంసరణల పేరుతో పూర్తిగా నీరుగార్చేలా ఉన్నదని సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. నైపుణ్యం అవసరం లేని పనిచేయడానికి ఇష్టపడే ప్రతి గ్రామీణ కూలీ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించడం ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2005 లక్ష్యం.
ఉపాధి కల్పనలో భాగంగా గ్రామాల్లో సుస్థిర వనరులను ఏర్పాటుచేసి ప్రజల జీవన ప్రమాణాలను బలోపేతం చేయాలని ఈ పథకం నిర్దేశిస్తున్నది. ఈ పథకం ప్రకారం.. ఉపాధి హామీ అనేది ఒక చట్టబద్ధమైన హకు. పని కావాలని అడిగిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చే నిబంధన ఉన్నది. కానీ, కొత్తగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీ-జీరామ్-జీ అనే బిల్లులో ఈ హ కు అనే పదాన్ని తొలగించి, దీన్ని ఒ క సాధారణ పథకంగా మార్చారు. అంటే ఇకపై కూలీల డిమాండ్‌ను బట్టి కా కుండా, కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసే ప్రణాళికలు, ఇచ్చే నిధుల బట్టి మాత్రమే పని దొరుకుతుంది.
రాష్ట్రాలపై నిధుల భారం..నియంత్రణ కేంద్రానిదే
జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది. కానీ, నేడు దానిని 60 శాతానికి కుదించింది. మిగిలిన 40% నిధులు రాష్ట్రాలే భరించాలి. కేంద్రంలోని మోదీ తెచ్చిన బిల్లు ప్రభావం వల్ల ఇప్పటికే అప్పుల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై ఏటా సుమారు రూ.4,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ అదనపు భారాన్ని ఎలా భరించగలదు? అనేది అంతుచిక్కని ప్రశ్న. 90 నుంచి 60 శాతానికి నిధుల్లో కోత పెట్టిన కేంద్రం, పనుల పర్యవేక్షణలో మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించేలా నిబంధనలు రూపొందించింది. టెక్నాలజీ పేరుతో కూలీల పనిదినాల్లో కోత పెట్టేందుకు కుట్రచేసింది. ఆధార్ ఆధారిత చెల్లింపులు, డిజిటల్ హాజరుతో ఇప్పటికే కూలీలు సతమతమవుతుంటే, కొత్త బిల్లులో బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో-స్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేయనున్నారు. వ్యవసాయ కూలీలు, వృద్ధులకు బయోమెట్రిక్ పడటం ఎంత కష్టమో తెలిసినా, ప్రభుత్వం ఈ నిబంధన పెట్టి పథకం నుంచి పేదలను దూరం చేయాలని చూస్తున్నది.
పాత పథకానికి కొత్త బిల్లులో తేడా
పాత పథకంలో ఏడాదిలో వంద రోజులపాటు గ్రామీణులకు ఉపాధి హక్కుగా లభిస్తుంది. కొత్త బిల్లులో ప్రణాళికలు, వ్యవస్థలకు అవసరమైతేనే ఉపాధి కల్పిస్తారు. లేదంటే పనులు చేపట్టరు. డిమాండ్‌ను బట్టి నిధులు ఇవ్వాలని, పనులు చేపట్టాలని ఉపాధి పథకంలో ఉండగా, వ్యవసాయ పీక్ సీజన్లో 60 రోజులపాటు పనులు నిలిపివేయాలని కొత్త బిల్లులో నిర్దేశించారు. కొత్త బిల్లులో కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా రాష్ర్టాలవారీగా నిధులు కేటాయిస్తారు. కేటాయించిన నిధుల కంటే ఎక్కువ పనులు చేస్తే ఆ మొత్తం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఇప్పటివరకు కూలీల వేతనాలను కేంద్రం 100% భరిస్తుండగా, మెటీరియ ల్ ఖర్చులో 75% ఇస్తున్నది. కొత్త బిల్లుతో కేంద్ర, రాష్ర్టాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు 60ః40 నిష్పత్తిగా మా ర్చారు. అంతగా పనులు ఉండని ఈ శాన్య, హిమాలయ రాష్ర్టాలకు మాత్రం 90ః10 నిష్పత్తిగా ఖరారు చేశారు. స్థా నిక సంస్థలకు (గ్రామ పంచాయతీలకు) అధికారాలు కల్పించే 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపకల్పనలపై గ్రామసభలకు నిర్ణయాధికారం ఉన్నది. కొత్త బిల్లులో దీనికి మంగళం పాడారు.