హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఔరంగాబాద్ జిల్లా కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్జాదవ్, సీనియర్ నాయకులు, సామాజిక ఉద్యమకారులు సురేశ్ జ్ఞానోబా గైక్వాడ్, యశ్పాల్ బింగేతోపాటు పలువురు నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మహారాష్ట్రలోని కంధార్ లోహాలో కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగసభ సందర్భంగా మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత సురేశ్ గైక్వాడ్ తదితరులు