మూసాపేట, జూలై 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి అన్నిరంగాల్లో ప్రగతి దిశగా దూసుకుపోతుండడంతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లిలో మంగళవారం గ్రామీణ క్రీడాప్రాంగణంతోపాటు రూ.10లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. అనంతరం పెద్దవాగు నుంచి చెరువులోకి వస్తున్న వరదను పరిశీలించారు. పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీహాల్, ప్రహరీ, గ్రామపంచాయతీ భవనం, మహి ళా సమావేశ మందిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన హెల్త్ సబ్‌సెంటర్ భవనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. అలాగే పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, వీఆర్ఏలకు హైజానిక్ కిట్స్, మట్టి ఇండ్ల యజమానులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ వంద కిలోమీటర్ల నుంచి కృష్ణాజలాలను తీసుకొచ్చి చెరువులను నింపుతున్నట్లు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని, అలాంటి వారి మాటలను పట్టించుకోవద్దని కోరారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశం లో ఎక్కడాలేవన్నారు. అందుకే కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ను తెలంగాణలో కలుపాలని బీజేపీ ప్రభుత్వాన్ని అక్క డి ప్రజలు కోరుతున్నారని చెప్పారు. పారదర్శకంగా పథకాల అమలు, రాష్ర్టాభివృద్ధిని చూసి దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని తెలిపారు. అనంతరం కొమిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ యూత్ నాయకుడు మురళీదర్రెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి పార్టీపరంగా అండగా ఉంటామని తెలిపారు. కాగా, గ్రామం లో ముదిరాజ్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, సర్పంచులు సాయిరెడ్డి, జయన్నగౌడ్, చంద్రశేఖర్, లక్ష్మణ్, శివరాములు, శ్రీనివాసులు, కొండయ్య, మల్లయ్య, రవి, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో సరోజ, ఏఈ లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.
తోటల పెంపకంపై దృష్టి సారించాలి
రైతులు తోటల పెంపకంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం కందూరుకు చెందిన రైతు దండు కృష్ణారెడ్డి వ్యవసాయ పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, తాసిల్దార్ కిషన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, జయన్నగౌడ్, ఆంజనేయు లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, జె డ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, ఎంపీటీసీ శ్యామలమ్మ, రంగన్నగౌడ్, దయాకర్, రమేశ్‌గౌడ్, విజయకుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, చల్మారెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాసులు, ఏవో శ్రీనివాసులు పాల్గొన్నారు.