మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు. రవి బైక్పై వెళ్తుండగా పత్తిపాక వద్ద కొందరు ట్రాక్టర్ అడ్డం పెట్టి అతన్ని ఆపారు. కారులో వచ్చిన దుండగులు.. రవిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయారు. కుప్పకూలిన రవిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే రవి హత్యకు వ్యాపార లావాదేవీలే కారణం అని, రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించామని, అందర్నీ త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ శరత్ చంద్ర పేర్కొన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బానోత్ రవి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. రవి హత్యకు వ్యాపార లావాదేవీలే కారణం, రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ పేర్కొన్నారు. pic.twitter.com/e6yDYAhp9E
— Namasthe Telangana (@ntdailyonline) April 21, 2022