వర్గీకరణ పేరుతో బీజేపీ మోసం
వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
- మాదిగ స్టూడెంట్ ఫోరం నేత రమేశ్
- కరీంనగర్లో మంత్రి గంగులకు మద్దతు
తెలంగాణచౌక్, నవంబర్ 26 : వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మరోసారి మోసం చేస్తున్నదని మాదిగ రాజకీయ పోరాట సమితి అనుబంధ సంస్థ మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో జిల్లా కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతున్నారని తెలిపారు. దళిత జాతి కోసం ప్రపంచంలోనే లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి దళిత బిడ్డకు పది లక్షల రూపాయలు అందిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చేపట్టలేదో మాదిగ సమాజానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలను ఓటు బ్యాంకు మాదిరిగా వాడుకుంటున్నట్టు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మాదిగలను మరోసారి మోసం చేయడం కోసం కమిటీ వేస్తామని ప్రకటించడాన్ని వారు తప్పుబట్టారు. కమిటీల పేరుతో కాలయాపన తప్ప వర్గీకరణ చేయరని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

