భోపాల్, జూన్ 9: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయంతో మధ్యప్రదేశ్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బెంగళూరుకు తరలించింది. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే భోపాల్ ఎయిర్‌పోర్టులో హంగామా చోటుచేసుకుంది. తమ ఫ్లైట్‌కు కావాలనే ఏటీసీ పర్మిషన్ ఇవ్వట్లేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. నాలుగు గంటల తర్వాత ఫ్లైట్ బయలుదేరింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 62 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింగర్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలు పూర్తిగా తమకే ఓటేస్తారని.. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదన్నారు.