హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్కేవీకి అనుబంధ ఐకేపీ వీవో సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మారిపెల్లి మాధవి ఎంపికయ్యారు. టీఆర్ఎస్కేవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ అధ్యక్షతన శనివారం తెలంగాణ భవన్లో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా యాదా ద్రి భువనగిరి జిల్లాకు చెందిన మచ్చేందర్ ఎంపికయ్యారు. ఐకేపీ వీవోలకు గౌరవ వేతనంగా రూ.3 వేలు ఇవ్వటంతోపాటు 30శాతం పీఆర్సీని వర్తింపజేస్తున్న సీఎం కేసీఆర్కు మాధవి కృతజ్ఞతలు తెలిపారు.