యాదగిరిగుట్ట, జూన్ 21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సేవలో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి పాల్గొని తరించారు. బుధవారం ఉదయం కొండకు చేరుకున్న స్వామీజీ స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండిత గోష్టి నిర్వహించారు. ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామీజీకి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.