మద్దూర్, సెప్టెంబర్ 8 : లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. మద్దూరు మండలం రేనివట్లకు చెందిన ఓ రైతు తన తండ్రి పేరుపై గ్రామ శివారులోని సర్వే నంబర్ 250 లోని 5 గుంటల భూమి తన పేరుపైకి మార్చాలని ఆర్ఐ అమర్నాథ్రెడ్డిని సంప్రదించాడు. దీనికి అతడు రూ.5 వేల లంచం డిమాండ్ చేశాడు. సోమవారం ఆర్ఐకి ఆ డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.