కమలాపూర్, డిసెంబ ర్ 22: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ(26) అనుమానాస్పదస్థితిలో అమెరికాలో మృతి చెందాడు. వంశీ ఏడాది క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి కాంకోర్డియా సెయింట్‌పాల్ వర్సిటీలో చదువుతున్నాడు. వంశీ మృతి విషయం తల్లిదండ్రులకు శనివారం రాత్రి తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు
గద్వాల అర్బన్, డిసెంబర్ 22 : కాచిగూడ నుంచి చెన్నై వెళ్లే ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ గద్వాలకు చేరుకున్న సమయంలో ఓ బోగీలో దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెం టనే ప్రయాణికులను దింపివేశారు. చ క్రాల దగ్గర ఉండే రబ్బర్ అరిగిపోవడంతో రాపిడికి మంటల వచ్చినట్టు అధికారులు గుర్తించారు.