హైదరాబాద్: ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) సంతాపం తెలిపారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. తెలుగు వారందరికీ గర్వకారణమైన రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు.
క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనదని తెలిపారు. తెలుగు భాష-సంస్కృతులకు చేసిన సేవ చిరస్మరణీయమైనదని వెల్లడించారు. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన ఆయన క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనదని చెప్పారు.
‘ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది.
రామోజీ రావు గారు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీరామోజీరావు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా… pic.twitter.com/NQIQjSfDZZ
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2024