e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News న‌వంబ‌ర్ 15 నుంచి ఎంటెక్‌, ఎంఫా‌ర్మసీ తర‌గ‌తులు

న‌వంబ‌ర్ 15 నుంచి ఎంటెక్‌, ఎంఫా‌ర్మసీ తర‌గ‌తులు

హైద‌రా‌బా‌ద్‌/‌సి‌టీ‌బ్యూరో, అక్టో‌బర్‌ 18 (న‌మస్తే తెలం‌గాణ): ఎంఈ, ఎంటెక్‌, ఎంఫా‌ర్మసీ, ఎంఆర్క్‌ తది‌తర కోర్సుల్లో ప్రవే‌శా‌లకు నిర్వ‌హిం‌చిన పీజీ‌ఈ‌సెట్‌ మొదటి విడుత వెబ్‌‌కౌ‌న్సి‌లిం‌గ్‌లో పలు మార్పులు చేసి‌నట్టు అడ్మి‌షన్స్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ రమే‌శ్‌‌బాబు తెలి‌పారు. ఆన్‌‌లైన్‌ రిజి‌స్ర్టే‌షన్‌, ఫీజు చెల్లింపు, సర్టి‌ఫి‌కెట్ల అప్‌‌లో‌డింగ్‌ గడువు సోమ‌వా‌రంతో ముగి‌యగా, తాజాగా ఈ నెల 25వరకు పొడ‌గిం‌చా‌మని చెప్పారు.

మొత్తంగా 17,628 మంది పీజీ‌ఈ‌సె‌ట్‌లో అర్హత సాధిం‌చగా, కేవలం 7,500 విద్యా‌ర్థులు మాత్రమే సర్టి‌ఫి‌కె‌ట్లను అప్‌‌లో‌డ్‌‌చే‌శా‌రని, ఈ నేప‌థ్యంలో గడు‌వును పొడ‌గిం‌చా‌మని వివ‌రిం‌చారు. న‌వంబ‌ర్ 15వ తేదీ నుంచి ఈ కోర్సుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయ‌ని తెలిపారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement