CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): శ్రీకృష్ణ జన్మాష్టమిని పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఉట్ల పండుగ’గా పిలుచుకుంటూ యువత కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని అన్నారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.
భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థించారు.