Lucky Draw | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగ వచ్చిందంటే ఆఫర్లు ప్రకటించని షాపులు ఉండవు. ఆన్లైన్ వ్యాపార వేదికలు మొదలు.. షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు కోకొల్లలు ప్రకటించడం చూస్తుంటాం. కానీ, ఈ సారి విజయదశమకి గ్రామాల్లోనూ వినూత్న స్కీమ్‌లు పుట్టుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొందరు యువకులు బృందాలుగా ఏర్పడి లాటరీ స్కీమ్‌లు ప్రవేశపెట్టారు. ‘వంద కొట్టు.. పొట్టేలు పట్టు’ అని కరపత్రికలతోపాటు వాట్సాప్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. పోతే వంద.. వస్తే పది వేల పొట్టేలు అని ప్రజలు కూడా స్కీమ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.100 తీసుకొని, ఈ నెల 10న లకీడ్రా తీస్తామని చెప్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.50 కొట్టు.. మేకను పట్టు అని తక్కువ మొత్తంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నారు.
10 మందికే బహుమతులు..
దసరా అంటేనే సుక్క, ముక్క. అందుకే నిర్వాహకులు గ్రామస్తులను ఆకర్షించేందుకు బహుతులుగా మేకపోతు, గొర్రెపొట్టేలు, ప్రీమియం మద్యం బాటిళ్లను బహుమతులుగా పెడుతున్నారు. ఈ స్కీమ్‌లో రూ.100 చొప్పున వెయ్యి మంది, రూ.50 చొప్పున రెండు వేల మంది చేరితే రూ.లక్ష అవుతాయి. బహుమతులకు రూ.50 వేలు పోగా, మరో రూ.50 వేలు నిర్వాహకులకు మిగులనున్నాయి. రెండు వారాల్లోనే 50 వేలు మిగులుతాయనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఈ ఆఫర్లు పెడుతున్నట్టు తెలిసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లాటరీలో పది మందికి మాత్రమే బహుమతులు రానుండగా, మిగతావారంతా నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం లాటరీ సిస్టమ్‌ను నిషేధించిందని పోలీసులు హెచ్చరిస్తున్నా.. మరోవైపు వీటిపై ప్రజలు ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం.
మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలో లాటరీ స్కీమ్ వివరాలు ఇలా..
కూపన్ ధర రూ.100