హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ పిలుపు కు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. ఎన్నిసార్లు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచినా ప్రజలు ముందుకు రా వడంలేదు. ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న హామీని అమలుచేయాలనే డి మాండ్లు పెరుగుతుండగా, ఇచ్చిన హామీ మరిచి ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఒక్క పైసా తీసుకోకుండా క్లియర్ చేస్తామని ఎన్నికల ముం దు ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడెందుకు ఫీజు వసూలుకు పాల్పడుతున్నదని ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నిసార్లు 25 శాతం రాయితీతో గడువు పొడిగించినా ప్రజలు స్పందించడం లేదు. ఇవన్నీ పట్టించుకోని రేవం త్ సర్కార్, వసూళ్లే లక్ష్యంగా మళ్లీ గడువు పొడిగించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. తాజాగా మరోసారి జూలై 31 వరకు గడువు పెంచింది.