మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే నీరకు కూడా తగ్గిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 76,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 65,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగాను 318.240 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాల గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 9.091 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.