దిలావర్పూర్, జనవరి 7: ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిజనిర్ధారణ కమిటీ సభ్యు లు ధర్మార్జున్ అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఇథనాల్ పరిశ్రమపై రైతులకు టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మార్జున్ మా ట్లాడుతూ.. ఇథనాల్ పరిశ్రమతో రైతులకు ప్రయోజనం లేదని చెప్పారు. కంపెనీ చెప్పే వాస్తవాలకంటే అసత్యాలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. చిత్తనూరులో కూడా రైతులను మభ్యపెట్టి ఈ పరిశ్రమ ఏర్పా టు చేశారని ఆరోపించారు. దేశంలో 200 పరిశ్రమలకు అనుమతినిచ్చిందని తెలిపారు.