Nizamabad | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పులు కలకలం సృష్టించాయి. లారీ డ్రైవర్ ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పెట్రోల్ బంకులో లారీ డ్రైవర్ మహ్మద్ సల్మాన్ (48)పై మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. మరో లారీలో వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. దాంతో బాధితుడిని ఇందల్వాయి ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అప్పటికే సల్మాన్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దుండగులు చంద్రయాన్పల్లి వద్ద వదిలేసి అడవిలోకి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.