IPL 2026 Auction : ఐపీఎల్ ఆరంభం నుంచి వేలంలో అంతర్జాతీయ స్టార్లదే హవా కొనసాగేది. కానీ, పంతొమ్మిదో సీజన్లలో మాత్రం సీన్ రివర్సైంది. విధ్వంసక ఆటగాళ్లను తోసిరాజని అనామకులు ఈసారి కోటీశ్వరులయ్యారు. నిండా పాతికేళ్లులేని కుర్రాళ్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ భారీ ధర పలికారు. ఇటీవల దేశవాళీలో నిలకడగా రాణించి ఫ్రాంచైజీల దృష్టిలో పడిన ఈ తారాజువ్వలు.. అబుధాబీలో హాట్‌కేకుల్లా అమ్ముడయ్యారు. రూ.30 లక్షల కనీస ధరతో యాక్షన్‌కు వచ్చిన ప్రశాంత్ వీర్ (Prashanth Veer), కార్తిక్ శర్మ (Karthik Sharma)లు ఏకంగా రూ.14.2 కోట్లు కొల్లగొట్టారు. వీరిలానే మరికొందరు దేశవాళీ క్రికెట్ హీరోలు ఒక్కరోజుతో కోట్లకు పడగలెత్తారు. వారెవరో చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అనుభవం కంటే ప్రతిభకే పట్టం కడుతుండడం చూశాం. నిలకడే కొలమానమంటూ ఇటీవల అదరగొట్టిన యువక్రికెటర్లపై కోట్లు కుమ్మరించాయి ఫ్రాంచైజీలు. అబుధాబీలో మంగళవారం జరిగిన వేళంలో.. దేశవాళీలో రాణించిన కుర్రాళ్ల పంటపడింది. ముఖ్యంగా దమ్మున్న ఆల్రౌండర్లను ఏరికోరి కొనుక్కున్నాయి ఫ్రాంచైజీలు.
Prashant Veer earns BIG! ✨💛
A staggering INR 14.2 Crore for the all-rounder as he joins @ChennaiIPL 🤝#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/TOOwJ5jG4J
— IndianPremierLeague (@IPL) December 16, 2025
తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో ఉతికేసిన ఉత్తరప్రదేశ్ కుర్రాడు ప్రశాంత్ వీర్ ఏకంగా రూ.14.20 కోట్లు కొల్లగొట్టాడు. వికెట్ కీపర్ బ్యాటరైన కార్తిక్ శర్మ (Karthik Sharma)ను సైతం రూ.14.20 కోట్లు పలికాడు. ట్రేండింగ్ పద్ధతిని రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (ChennaiSuper Kings) వీరిద్దరిని పట్టేసింది.
Auqib Dar is all set to feature in the #TATAIPL 👌
The all-rounder joins @DelhiCapitals for INR 8.4 Crore 👏👏#TATAIPLAuction pic.twitter.com/RQ1tK7W2RF
— IndianPremierLeague (@IPL) December 16, 2025
స్మాట్‌లో ఏడు మ్యాచుల్లోనే 15 వికెట్లతో మెరిసిన జమ్ము కశ్మీర్ పేసర్ అకీబ్ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.4 కోట్లకు కొన్నది. మణికట్టు స్పిన్నర్ మంగేశ్ యాదవ్ (Mangesh Yadav)ను రూ.5.20 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ స్పిన్నర్ ఎంపీ టీ20లో ఆరు మ్యాచుల్లో 14 వికెట్లతో దడ పుట్టించాడు. దాంతో.. తమకు పేస్ అస్త్రంగా పనికొస్తాడని ఈ యంగ్‌స్టర్‌ను భారీ ధరకు కొన్నది ఆర్సీబీ.
లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటరైన ప్రశాంత్ ఇటీవల యూపీ టీ20లో 155.34 స్ట్రయిక్ రేటుతో 320 పరుగులు సాధించాడు. బంతితోనూ రాణించి 8 వికెట్లు కూల్చాడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇక పొట్టి ఫార్మాట్లో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 112 రన్స్.. బంతితోనూ తిప్పేస్తూ 9 వికెట్లు పడగొట్టాడు. 19 ఏళ్ల కార్తిక్ ఇప్పటివరకూ టీ20ల్లో 12 మ్యాచుల్లో 162.93 స్ట్రయిక్ రేటుతో 334 పరుగులు సాధించాడు. పవర్ హిట్టింగ్ ఆడగల ఈ ఇద్దరు చెన్నై భవిష్యత్ తారలు అవుతారలవ్వడం ఖాయం.